నదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతు

అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. రేణిగుంట మండలం జీపాల్యం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు చేపల వేటకు వెళ్లారు. నదిలోకి దిగిన వారు గల్లంతయ్యారు.

వీరిని గమనించిన స్థానికులు లిఖిత్ సాయి అనే చిన్నారిని రక్షించారు. మరో ముగ్గురికోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైనవారిని గుర్తించడానికి గజ ఈతగాళ్లను రప్పించారు.