కూడా చైర్మన్ గా సుందర్ రాజు నియామకం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కూడా చైర్మన్ గా స్థానిక మాస్టర్ జీ విద్యాసంస్థల అధిపతి అయిన సుందర్ రాజును నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. గతంలో కూడా చైర్మన్ గా మర్రి యాదవరెడ్డి కొనసాగారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ జీ విద్యాసంస్థల అధిపతిగా, టీఆర్ఎస్ నాయకులుగా సుందర్ రాజు యాదవ్ పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ సర్కార్ నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వహించే ప్రతీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొని కార్యక్రమాలు సక్సెస్ చేయడంలో ముందుంటున్నాడు.
దీంతో సుందర్ రాజు యాదవ్ ను గుర్తించిన టీఆర్ఎస్ సర్కార్ కూడా చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. తనకు కూడా చైర్మన్ గా నియమించిన టీ సర్కార్ కు , స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు సుందర్ రాజ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కూడా చైర్మన్ గా తన బాధ్యతలను నిర్వహిస్తానని తెలిపారు.