తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర కలవర పెడుతోంది. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9వేల మార్కును దాటేసింది. మంగళవారం తాజాగా 879 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9553కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్ పరిధిలో 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
° 220కి చేరిన మరణాలు
ఈ రోజు 3006 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. 879 పాజిటివ్ కేసులు వచ్చాయని బులిటెన్‌లో వెల్లడించింది. కొవిడ్ బాధితుల్లో 219మంది ఈ రోజు డిశ్చార్జి కాగా.. కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 9వేలకు పైగా కేసుల్లో 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం 5109మంది చికిత్సపొందుతున్నారు.
జిల్లాల వారీగా నమోదైన కేసుల్ని పరిశీలిస్తే..