`చ‌క్ర` ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

హైదరాబాద్: యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కాగా కాసేప‌టి క్రితం `చ‌క్ర`‌ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌‌ల చేశారు. యాక్ష‌న్ హీరో విశాల్. ప‌వ‌ర్‌ఫుల్ ‌లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా జూన్ 22 సాయంత్రం 5 గంట‌ల‌కు `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ `అభిమ‌న్యుడు` త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త `చ‌క్ర` ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వీడియోలో విశాల్ ప‌వ‌ర్‌ఫుల్ మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర,మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.