ఆ రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ నేడు కీలక నిర్ణయం

ఆ రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ నేడు కీలక నిర్ణయంఆ రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ నేడు కీలక నిర్ణయం

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ విలేఖరుల సమావేశాన్ని జరపనుంది.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఐదు సంవత్సరాల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వతేదీల్లో ముగియనుంది. దీంతో మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి ఎన్నికల సంఘం గత వారం మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.