పొట్టి వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విక్టరీ 

పొట్టి వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విక్టరీ

పొట్టి వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విక్టరీ 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పొట్టి వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ ( 53 నాటౌట్ )తో గెలిపించింది. ఫాతిమా సనా వేసిన 19వ ఓవర్ లో జెమీమా రోడ్రిగ్స్ 3 ఫోర్లు బాదింది. దీంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. జెమీయా, రీచా ఘోష్ (31) నాలుగో వికెట్ కు 58 రన్స్ జోడించారు. విరోచితంగా ఆడి జట్టును గెలిపించిన జెమీమ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘ అవార్డు అందుకుంది.