ఇన్నర్ రింగు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి : అర్బన్ కలెక్టర్

వరంగల్ అర్బన్ జిల్లా: నాయుడు పెట్రోల్ పంపు నుంచి ఏనుమాముల రోడ్డు వరకు చేపట్టే పట్టణ ఇన్నర్ రింగు రోడ్డు సంభందించిన భూసేకరణను సత్వరమే పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

ఇన్నర్ రింగు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి : అర్బన్ కలెక్టర్ఆదివారం వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ పమేలాసత్పాతి అర్డిఓ వెంకరెడ్డితో కలిసి ఇన్నర్ రింగు రోడ్డును పరిశీలించారు. ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే భూసేకరణ పూర్తి అయినందున మిగితా మరో 50 శాతం భూసేకరణను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయలని సంభందిత అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 200 ఫీట్లు గల ఇన్నర్ రింగు రోడ్డు వలన పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ ను క్రమబద్దకరణ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. రోడ్డును చేపట్టేందుకు నిధులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాయుడు పెట్రోల్ పంపు నుంచి రెడ్డి పురం వరకు ఇన్నర్ రింగు రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూడా పి ఓ అజిత్ రెడ్డి తహశీల్దార్, కూడా, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.