కల్తీ మద్యానికి ఆరుగురు బలి

కల్తీ మద్యానికి ఆరుగురు బలిపాట్నా : సంపూర్ణ మద్యనిషేధం అమలులో బీహార్ లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మరణించి వారం రోజులు కూడా గడవకముందే మరో ఘటన జరగడం గమనార్హం.