అక్కడ బీజేపీని గెలిపిస్తే రూ. 50కే చీప్ లిక్కర్

అక్కడ బీజేపీని గెలిపిస్తే రూ. 50కే చీప్ లిక్కర్విజయవాడ : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీని గెలిపిస్తే రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపిస్తే రూ.75కే చీప్ లిక్కర్ విక్రయిస్తాం, ఆదాయం ఇంకా బాగొస్తే రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఏపీలో నాణ్యమైన లిక్కర్ ను విక్రయించడం లేదని , కల్తీ మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నాణ్యమైన చీప్ లిక్కర్ కోసమైనా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని వీర్రాజు కోరారు.