ఓవైసీ-మిధాని ఫ్లై ఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం పేరు

ఓవైసీ-మిధాని ఫ్లై ఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం పేరుహైదరాబాద్ : నగరంలో ఓవైసీ- మిధాని జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును నామకరణం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. డీఆర్డీవోలో పని చేసిన గొప్ప మనిషి అబ్దుల్ కలాంకు ఇదే మా నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో ఓ దశాబ్ద కాలం పాటు అబ్దుల్ కలాం నివాసమున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న కలాంకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఇక ఓవైసీ-మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్ ను ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మించినట్లు కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.