ఆ కాలేజీలో మరో 59 మంది వైద్యులకు కరోనా

ఆ కాలేజీలో మరో 59 మంది వైద్యులకు కరోనాపాట్నా : బీహార్ లోని నలందా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో సోమవారం 72 మంది వైద్యులు కరోనా బారిపడ్డారు. కొత్తగా మరో 59 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం సంఖ్య 143కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం మెడికల్ కాలేజీలో మొత్తం 194 మంది నుంచి నమూనాలను సేకరించారు.

అందులో 72 మంది వైద్యులకు కరోనా నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు ఎన్ఎంసీహెచ్ లో 12 మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. దీంతో గత 3, 4 రోజులుగా బాధిత వైద్యులను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

బీహార్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తున్నది. రాష్ట్ర రాజధాని పాట్నలో మంగళవారం ఒకేరోజు 565 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 893 కొత్త కేసులు నమోదయ్యాయి.