ఆర్జీవీ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్

ఆర్జీవీ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్అమరావతి : డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్వీట్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మ చేసిన 10 ప్రశ్నల ట్వీట్ కు పేర్ని నాని సమాధానం ఇచ్చారు. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ కు ఒక ఫార్ములా చెప్పారు. “ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ” మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు.

ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్ లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మగారూ? అమ్మే వారికా? “నిర్మాతల శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్ ను గాలికొదిలేశారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ..అంటూ ట్వీట్ చేశారు.

సినిమాను ఎమర్జెన్సీ సర్సీసుగా ప్రభుత్వం భావిస్తుంటే దాని మాదిరిగానే మెడికల్, ఎడ్యుకేషన్ లోనే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు? “సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు. థియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని ” పేర్ని నాని ట్వీట్ చేశారు.

ఇక “రూ.100 టికెట్ ను రూ.1000, రూ.2000 లకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు అని కౌంటర్ ఇచ్చాడు. డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెట్ అంటారా ?” అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.