కుదిరితే జనసేనతో..లేకుంటే జనంతోనే..

కుదిరితే జనసేనతో..లేకుంటే జనంతోనే..

కుదిరితే జనసేనతో..లేకుంటే జనంతోనే..

వరంగల్ టైమ్స్,అమరావతి : ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతూనే వుంది. పొత్తు పొడుపులు,పెదవి విరుపులు కనిపిస్తూనే వున్నాయి. ఏపీ ఎన్నికలకు ఇంకా 15 నెలల వరకూ గడువు వుంది.అయితే ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తులపై తాను చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జన సేనతో మైత్రిపై బయట అనేక ప్రచారాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే “వస్తే జన సేన తో” లేదంటే “జనం” తోనే మా పొత్తు అంటున్నాం అని అన్నారు సోము.

జనంతోనే మా పొత్తు అన్న నినాదం మాకు చాలా బలమైనది, ముఖ్యమైనదని ఆయన చెప్పారు. ఓట్లు చీలకూడదనే పవన్ కామెంట్స్, చంద్రబాబుతో భేటీల నేపథ్యంలో బయట రకరకాల ప్రచారాలు ఉన్నాయని అన్నారు. అందుకే వస్తే జనసేనతో వెళ్ళాలని తాను అంటున్నట్టు స్పష్టం చేశారు సోము. ఫోన్ ట్యాపింగ్ విషయం కొత్తేమీ కాదనీ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల ఫోన్ల ట్యాప్ చేసిందనీ, ఇప్పుడు టీడీపీ నేతల, సానుభూతి పరుల ఫోన్లు ట్యాప్ చేస్తారని, అందులో వింతేమీ లేదన్నారు సోము.

అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్లు అంటూ తనదైన శైలిలో వివరించారు సోము వీర్రాజు. జన సేనతో పొత్తుపై బయట అనేక ప్రచారాలు ఉన్నాయి. అందుకే వస్తే జనసేనతో పొత్తు అంటున్నాం.జనంతోనే మా పొత్తు అన్న నినాదం మాకు చాలా బలమైనది,ముఖ్యమైనది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రధానమైన పాత్ర బీజేపీదే అన్నారు సోము వీర్రాజు.