సైకో మొగుడి నుండి ప్రాణ హాని
వరంగల్ టైమ్స్, కడప : అతను గౌరవ న్యాయవాది వృత్తిలో ఉండి భార్యను శతవిధాల తన శాడీజంతో హింసిస్తున్నాడని బాధిత మహిళ కడప ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో బోరున విలపించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు మైదుకూరు మండలం గడ్డంవారిపల్లెకు చెందిన అంబారపు మస్తానయ్యతో 13యేళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందని తెలిపారు. తన అమ్మ, నాన్న ప్రకాశం జిల్లా కంభంకు చెందిన వారని ఆమె తెలిపారు. తనకు ముగ్గురు సంతానం. వారిని చదువు నిమిత్తం గోవాలో ఉంచారని ఆమె పేర్కొన్నారు.పెళ్ళైన నాటి నుంచి తన భర్త అనేక రకాల వేధింపులకు గురి చేసేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన అమ్మ వారికి విషయం చెబితే చంపుతానని తన భర్త బెదిరింపులకు పాల్పడేవాడని వాపోయారు. ఇటీవల తన తమ్ముడు, నాన్న వచ్చినప్పుడు తన పరిస్థితిని గమనించారని తెల్పింది. దీంతో తన గోడును తమ్ముడు, నాన్నతో వెలిబుచ్చుకున్నట్లు ఆమె తెల్పింది. అప్పటికే చిత్రహింసలు తాళలేక లేవలేని పరిస్థితి గమనించి బాధపడుతున్న ఆమె 13 యేళ్ల నరక యాతనను తన తమ్ముడికి, నాన్నకు చెప్పుకుంది. శాడిస్టు మొగుడు ఒళ్ళంతా వాతలు పెట్టాడని బాధిత మహిళ సల్మా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ జరిగిన దురాగతాలను వివరించింది. ఈ విషయంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు.