భారీగా మావోల లొంగుబాటు..మరి గణపతి?

భారీగా మావోల లొంగుబాటు..మరి గణపతి?

-లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు
-31 ఏకే 47 తుపాకులు, ఆయుధాలు అప్పగింత
-గణపతి లొంగుబాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
-ఈ నెల 8న సంచలన ప్రకటన
-తెలంగాణ పోలీసుల ద్వారా సాగిన వ్యవహారం
-అధికారికంగా నిర్ధారించని అధికారులు
-క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
-మరో 7గురు మావోలు లొంగిపోవాలని పిలుపు

భారీగా మావోల లొంగుబాటు..మరి గణపతి?వరంగల్ టైమ్స్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు దేవ్ జీ, బడే చొక్కారావు గన్ మెన్ లు ఉన్నారు. శనివారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూంలో డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యాన సీఎం సమక్షంలో లొంగిపోయారు. దేవ్ జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం 130 మంది 124 తుపాకులతో లొంగిపోవడం విశేషం. వీటిలో 31 ఏకే 47 తుపాకులున్నాయి. ఈ సందర్భంగా నక్సల్స్ అప్పగించిన తుపాకులను సీఎం పరిశీలించారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్ ఘడ్, తెలంగాణకు చెందిన 4 గురు అజ్ఞాతంలో ఉన్నవారు, ఒకరు ఏపీకి చెందిన వారని డీజీపీ వెల్లడించారు.

భారీగా మావోల లొంగుబాటు..మరి గణపతి?మావోయిస్టు అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేగుతోంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన లొంగుబాటుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల రహస్య ప్రయత్నాలతో గణపతి ఢిల్లీకి చేరుకున్నారని, త్వరలోనే అధికారిక లొంగుబాటు ఉంటుందని సమాచారం. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో లొంగిపోతారు అని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత ముప్పాళ లక్ష్మణరావు రావు (గణపతి ) లొంగుబాటు పై శనివారం సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గణపతి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఎక్కడ ఉన్నా లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గణపతి అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పూర్తి పునరావాసం కల్పిస్తామని ఆయన అన్నారు.భారీగా మావోల లొంగుబాటు..మరి గణపతి?తెలంగాణకు చెందిన ఇంకా 7 గురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా త్వరగా లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. 40 యేండ్ల మావో ప్రస్థానం, వయస్సు 70యేళ్లు దాటింది..పైగా అనారోగ్యం మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా గణపతి సరెండర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అప్పటికే అమిత్ షాతో ఈ విషయంపై చర్చించిన విషయం తెలిసిందే. గణపతి రహస్య ప్రాంతం నుంచి ఢిల్లీకి చేరుకున్నారని సమాచారం. గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా భావిస్తున్నారు.భారీగా మావోల లొంగుబాటు..మరి గణపతి?ఇదిలా ఉంటే మావోయిస్టు గణపతి మార్చి 8న లొంగిపోతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయనతో పాటు ఆయన భార్య సుజాత, కంపెనీ కమాండర్ కోర్సా లక్కు చలసాని నవత వంటివారు అలాగే సుమారు 100 మందికి పైగా మావోయిస్టులు కీలకమైన క్యాడర్ లో అగ్ర నాయకులు కూడా లొంగిపోతారు అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం మావోల చరిత్రలో అతి పెద్ద కుదుపుగానే భావించాలని అంటున్నారు. ఈ నెలాఖరులోగా మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు వేస్తామని కేంద్రం పదే పదే చెబుతూ వస్తోంది. ఆ విధంగానే ఆపరేషన్ కగార్ సాగుతోంది. ఇక చూస్తే కనుక గత యేడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఏకంగా 600 మంది దాకా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు అని అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహరెడ్డి వంటి అగ్ర నేతలే లొంగిపోయారు అని గుర్తు చేస్తున్నారు. వీరి లొంగుబాటుతో మావోల ఉద్యమానికి ముగింపు వచ్చినట్లే అన్న చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.