తెలంగాణ లా సెక్రటరీగా నందికొండ బాధ్యతలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీగా నందికొండ నర్సింగరావు సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం అనంతరం నర్సింగరావు అరణ్య భవన్ లో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్యాయశాఖ కార్యదర్శి నర్సింగరావుకు శుభాకాంక్షలు తెలిపారు.














