ఇక సిగరెట్లు విడిగా అమ్మడం కష్టమే..!

ఇక సిగరెట్లు విడిగా అమ్మడం కష్టమే..!

సిగరెట్లు విడిగా అమ్మడంపై నిషేధం.. కేంద్రం యోచన
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నిర్ణయం
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసే అవకాశం
సిగరెట్ల కారణంగా దేశంలో ఏటా 3.5 లక్షల మంది మృత్యువాత

ఇక సిగరెట్లు విడిగా అమ్మడం కష్టమే..!

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సిగరెట్లను విడిగా విక్రయించడంపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిగరెట్లను విడిగా విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. సిగరెట్లను విడిగా విక్రయిస్తుండడంతో పొగాకు వినియోగం ఏమాత్రం తగ్గడం లేదని పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ప్రతీ యేడాది 3.5 లక్షల మంది మరణిస్తున్నట్టు తెలిపింది.

పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నప్పటికీ ఫలితం ఉండడం లేదని కమిటీ అభిప్రాయపడింది. సిగరెట్‌పై ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉందని, అలాగే కాంపెన్సేషన్ సెస్ కూడా ఉందని తెల్పింది. మొత్తంగా 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం ఉంది. అన్నీ కలిపి లెక్కిస్తే ఒక్కో సిగరెట్ ధరలో 64 శాతం వరకు పన్ను ఉంటుంది. ఐతే, ఇవేవీ సిగరెట్ల వినియోగాన్ని నియంత్రించలేకపోతున్నాయి. సిగరెట్ వినియోగంతో నోటి క్యాన్సర్ ముప్పు కూడా అంతకంతకూ పెరుగుతోంది.

గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సిగరెట్లపై పన్ను భారాన్ని 75 శాతం వరకు పెంచాలని సూచించింది. కమిటీ సిఫార్సుల నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లూజ్ సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని సమాచారం.

2016 లో ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. ఐతే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు. భారత్‌లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు.