UPSC ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న పరీక్ష జరగ్గా.. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి పేర్లతో లిస్టును విడుదల చేసింది. అలాగే మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ షీట్లను upsc.gov.in వెబ్‌సైటులో ఉన్నాయి. అలాగే మార్కులకు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య 011-23385271, 011-23098543, 011-23381125 నెంబర్లకు ఫోన్ చేయాలని UPSC సూచించింది.