డిసెంబరులో టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి ?

డిసెంబరులో టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి ?

లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికే పెళ్లి వాయిదా
నయా ముహూర్తం పెట్టిన కుటుంబ సభ్యులు?
తన ఫాంహౌస్‌లోనే వివాహం జరిపేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా నటుడు నితిన్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో పోయిన నెల 16నే ఆయన పెళ్లి చేయాలని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. డిసెంబరులో టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి ?కాగా, ఆయన పెళ్లి ఈ ఏడాది చివరలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. డిసెంబరు నాటికి కూడా కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ త‌న మ్యారేజ్ చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. తన ప్రేయసి శాలినితో నితిన్ నిశితార్థం కొన్ని నెలల క్రితమే జరిగింది. ప్రస్తుతం నితిన్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.