మెదక్ జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు
మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. మూడేళ్ల బాలుడు సాయి వర్ధన్ బోరుబావిలో పడ్డాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు సంఘటనస్థలానికి చేరుకుని బోరుబావిలోకి ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. బోరు బావికి సమాంతరంగా అధికారులు గొయ్యిని తవ్వుతున్నారు. 120 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీరు రాలేదని యజమాని వ్యవసాయ బోరు బావిని వృథాగా వదిలేశాడు.