రెండు సార్లు లేచిపోయిన భార్య..భర్త ఆత్మహత్య
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: భార్య రెండుసార్లు లేచిపోయింది, ఒక దఫా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తితో పారిపోయింది, ఆ తర్వాత కొన్నాళ్ళకు వచ్చింది. పిల్లలకోసం సర్దుకున్నాడు. మళ్ళీ మరొకరితో లేచి పోయింది. దీంతో పిల్లలను అత్త, మామా తీసుకెళ్లారు. ఇంకెందుకు జీవితం అనుకున్నాడో ఏమో, తన చావుకు తన భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని లెటర్ రాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రెడ్డి లోకం వదిలి పోయాడు. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి రేణుక దంపతులు ఇద్దరూ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది.
అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24న మళ్లీ వేరొకరితో లేచిపోయింది. భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ కే వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఆదివారం పిల్లలను తీసుకుని నంద్యాల వెళ్లిపోయారు. దీంతో ఆవేదనకు గురైన సీతారాంరెడ్డి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.














