లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు ఉద్యమిద్దాం

లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు ఉద్యమిద్దాం: దాస్యం విన‌య్ భాస్క‌ర్

లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు ఉద్యమిద్దాంవరంగల్ టైమ్స్, హనుమకొండ: జాతీయ సార్వ‌త్రిక స‌మ్మె సందర్భంగా గురువారం హనుమకొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తింది. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా కార్యాల‌యం బాల‌స‌ముద్రం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు బీ ఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘాల‌తో క‌లిసి ఉద్యోగ కార్మిక హ‌క్కుల సాధ‌నలో భాగంగా బైక్, ఆటో ర్యాలీ నిర్వ‌హించారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి కార్మికుల హక్కుల విషయమై వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సంద‌ర్భంగా దాస్యం విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ,పెట్టుబ‌డిదారుల‌ లాభం కార్మికుడి క‌ష్టంతో వ‌స్తుందని, సంప‌న్నుల సంప‌ద కార్మికుడి చెమ‌ట చుక్కతో పెరుగుతుందని అన్నారు.శ్ర‌మ చేయ‌డ‌మే తెలిసిన కార్మికుడి క‌ష్టాలు ఎక్కువ‌ అని, నిత్యం ప‌రిశ్ర‌మించే కార్మికుడికి వేత‌నాలు త‌క్కువ‌ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్ర‌మ‌, స్వేదం తెలిసిన కార్మికుల‌కు నేడు హ‌క్కులు ద‌క్కుడం లేదని, అనునిత్యం ప‌నిలో పోరాడినా ప్ర‌తిఫ‌లాలు ఉండ‌డం లేదని విమర్శించారు.యాజ‌మాన్యాల ఆర్థిక పురోగ‌తి, శ్రామికుల అధోగ‌తి పాలు అవుతున్నారని అన్నారు అభివృద్ధి ఫ‌లాలు కొంద‌రికి దక్కుతున్నాయని, ఆక‌లి కేక‌లే శ్ర‌మించే శ్రామికుల‌కు మిగులుతున్నాయని అన్నారు.కార్మికుడి శ్ర‌మ‌కు సెల‌వు లేదని, ఆ శ్ర‌మ లేనిదే సంప‌ద‌, విజ‌యం లేదని తెలిపారు.అందుకే కార్మికులారా ఏకం అవుదామని పిలుపునిచ్చారు. హ‌క్కుల కోసం ఉద్య‌మిద్దామని, కుట్ర‌ల‌తో తొల‌గించిన హ‌క్కుల‌ను… కొట్లాడి సాధించుకుందామని అన్నారు.పోరాడిదే పోయేది మ‌న‌ల్ని బానిస‌లుగా మార్చే చ‌ట్టాలనే సంకెళ్లు… ఐక్యంగా నిల‌బ‌డ‌దామని, కార్మిక శ‌క్తిని చాటుదామని అన్నారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు నూత‌న కార్మిక చ‌ట్టాల కార‌ణంగా కార్మికులు వారి క‌నీస హ‌క్కుల‌ను కోల్పోతున్నార‌ని అన్నారు ప‌నికి త‌గ్గ వేత‌నం, సెల‌వులు, నిర‌స‌న తెలిపే హ‌క్కులు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్నాయ‌ని వివ‌రించారు.

మేనేజ్మెంట్ వారి ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేసే ఉద్యోగిని హైర్ అండ్ ఫైర్ విధానంలో తీసుకొనే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం హ‌క్కుల సాధ‌న‌కు ఉద్య‌మిస్తే వారిని తొల‌గించే ప్ర‌మాదంలో ఉద్యోగులు ఉంటార‌ని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి క‌నీస సౌక‌ర్యాలు పొంద‌లేని ప‌రిస్థితి భ‌విష్య‌త్‌లో రాబోతోంద‌ని ఈ నూత‌న కార్మిక చ‌ట్టాల ద్వారా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. యూనియ‌న్ల‌ను ఏర్పాటు చేసుకునే హ‌క్కును సైతం కోల్పోతార‌ని అన్నారు.కార్మికుల హ‌క్కుల కోసం అన్ని సంఘాలు ఏక‌మై కేంద్రంపై పోరాడుదామ‌ని పిలుపునిచ్చారు.రైతు ఉద్య‌మ‌మే స్ఫూర్తిగా కార్మికులంద‌రం ఉద్య‌మిద్దామ‌ని సూచించారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని, జాతీయ సార్వ‌త్రిక స‌మ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని తెలిపారు.

4 నూత‌న కార్మిక చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలని 29 పాత కార్మిక చ‌ట్టాల‌ను పున‌రుద్ధ‌రించాలి డిమాండ్ చేశారు.కార్యక్రమంలో బి ఆర్ టి యు హనుమకొండ జిల్లా కన్వీనర్ నాయిని రవి, మా తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షులు ఈసంపల్లి సంజీవ శ్రీధర్ రెడ్డి బాబు ప్రతాపరుద్ర ఆటో యూనియన్ నరహరి సాంబయ్య,టీబీఎన్ ఆర్కే యూనియన్ నాయకులు చిలువేరు బిక్షపతి రఘుపతి రెడ్డి నారాయణగిరి రాజు సిద్ధిక్ , పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారపు రాజు, నాయకులు కార్మిక నాయకులు తిరుపతి సాంబయ్య, చారి, చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ హమాలి సంఘ నాయకులు విజయ్ తదితర సంఘాల నాయకులు అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.