పంత్ ను స్పెషల్ రూంకి షిఫ్ట్ చేసిన వైద్యులు

పంత్ ను స్పెషల్ రూంకి షిఫ్ట్ చేసిన వైద్యులు

పంత్ ను స్పెషల్ రూంకి షిఫ్ట్ చేసిన వైద్యులు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్ మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ పేర్కొన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో పంత్ ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. ‘ ఐసీయూలో చికిత్స పొందుతున్న పంత్ కు ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో అతన్ని స్పెషల్ రూంకి మార్చాల్సిందిగా అతని కుటుంబ సభ్యులు, హాస్పిటల్ సిబ్బందికి చెప్పాం. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలో కోలుకుంటాడు’ అని శర్మ వెల్లడించారు.

కాగా, రిషభ్ పంత్ ను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి ఆదివారం పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించి..పంత్ వైద్యానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.