అద్భుతంగా యాదాద్రీశుడి ఉత్తర ద్వారం దర్శనం

అద్భుతంగా యాదాద్రీశుడి ఉత్తర ద్వారం దర్శనం

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తరదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు.అద్భుతంగా యాదాద్రీశుడి ఉత్తర ద్వారం దర్శనంఆలయ చరిత్రలో మొదటిసారిగా ఉత్తర దర్శనం భక్తులకు మహాద్భుతంగా జరిగింది. అర్చక బృందం దేవమంత్ర పఠనాలతో సాంబ్రాణి పొగలతో స్వామివారు భక్తులకు అద్భుతంగా కనిపించారు. దర్శన సమయంలో జై నరసింహ జై జై నరసింహ అంటూ భక్తులు హర్షధ్వానాలతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, సీఎం ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాత గుట్టు దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు.