ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళా మహేశ్వరి మృతి
వరంగల్ టైమ్స్,ఢిల్లీ: భారతీయ టెలివిజన్లో ప్రత్యక్షంగా చదివిన తొలి వార్తా వ్యాఖ్యాతల్లో ఒకరైన ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళ మహేశ్వరి 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ ఆమెకు “హృదయపూర్వక నివాళి” అర్పించింది. ఆమెను “గౌరవనీయమైన న్యూస్ రీడర్” అని అభివర్ణించింది. ఆమె “మృదువైన స్వరం, ఖచ్చితమైన ఉచ్చారణ, గౌరవప్రదమైన ప్రదర్శన” కు ప్రసిద్ధి చెందింది..











