వరంగల్ వాసికి అత్యుత్తమ పీ హెచ్ డీ డాక్టరేట్

వరంగల్ వాసికి అత్యుత్తమ పీ హెచ్ డీ డాక్టరేట్

-ఆర్టీసీ డ్రైవర్ కూతురు కి వ్యవసాయ డాక్టరేట్వరంగల్ వాసికి అత్యుత్తమ పీ హెచ్ డీ డాక్టరేట్వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డు కు చెందిన సాధారణ ఆర్టీసీ డ్రైవర్ కూతురికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ప్రధానం చేసింది. వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో గల సంతోషిమాత కాలనీకి చెందిన ఇటికాల లింగయ్య కూతురు ఇటికాల అనూష వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసి గౌరవ డాక్టరేట్ను పొందింది. ఆదివారం హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా స్నాతనోత్సవం 2026 వైభవంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆల్దాస్ జానయ్య అధ్యక్షత వహించారు. ఇటికాల అనూష పత్తి విభాగంలో వర్షాధార పత్తి పంటలు సవాళ్లు లాభాలు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ అందించింది.

ఈ డాక్టరేట్ను అమెరికా కార్నిల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అంతర్జాతీయ వ్యవసాయరంగా నిపుణుడు ప్రభు పింగాలి ముఖ్యఅతిథిగా హాజరై డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుండి జన్మించిన తాను గౌరవ డాక్టరేట్ అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు వ్యవసాయంలో నూతన విధానాలు సాగుకు సాంకేతికతను జోడించి అధిక దిగుబడి నాణ్యమైన పంటలు అందించడమే లక్ష్యంగా తాము పరిశోధనలు చేశామని ఆ పరిశోధనలు రైతులకు ఉపయోగపడేలా మరిన్ని పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తన డాక్టరేట్ కు సహకరించిన ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.