హనుమకొండలో ‘LITE ZIP’ప్రారంభం

భారత్ గ్యాస్ బంగారు కానుక… హనుమకొండలో ‘భారత్ గ్యాస్ లైట్ జిప్ ‘ ప్రారంభం

* ఇక గ్యాస్ కనెక్షన్ల భారంపై వినియోగదారులకు ఊరట
* తక్షణ కొత్త కనెక్షన్లు
* కేవలం 4 గంటల్లోనే ఎక్స్ ప్రెస్ డెలివరీ
* తక్కువ బరువు, తుప్పు పట్టని సిలిండర్
* మెరుగైన భద్రత, ఆధునిక రూపకల్పన

హనుమకొండలో 'LITE ZIP'ప్రారంభంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా :: భారతదేశంలోని ప్రముఖ ఇంధన సంస్థలలో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సరికొత్త ఒరవడికి నాంది పలికింది. అధిక బరువు ఉండే గ్యాస్ సిలిండర్ మోయడాలు, లేట్ డెలివరీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు త్వరగా కొత్త ఎల్.పీ.జీ కనెక్షన్ ను పొందేలా వీలు కల్పించేందుకు తక్షణ కొత్త కనెక్షన్ మరియు సరళీకృత అన్ బోర్డింగ్ ప్రక్రియను తీసుకువచ్చింది. భారతదేశం మొత్తంలో గ్యాస్ కనెక్షన్స్ భారమైన వేళ వినియోగదారుల అవసర నిమిత్తం ‘భారత్ గ్యాస్ లైట్ జిప్ ‘ అనేది బీపీసీఎల్ అందిస్తున్న బంగారు కానుక. దీనికి ఎలాంటి ఓటీపీ మరియు ఎలాంటి బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ అవసరం లేదు.

తేలికైనటువంటి, పారదర్శకమైన ఆధునాతన సిలిండర్ ను వినియోగదారులకు అందించడానికి ‘భారత్ గ్యాస్ లైట్ జిప్ ‘ ను ప్రీమియం ఎల్పీజీ, అనుభవాన్ని పొందడానికి బీపీసీఎల్ ఆధునిక రూపకల్పనకు ప్రాణం పోసింది. ఈ ఆధునిక రూపకల్పనలో భాగంగానే శనివారం హనుమకొండలోని బాప్టిస్ట్ కాంప్లెక్స్ కారిడార్ లో ‘భారత్ గ్యాస్ లైట్ జిప్ ‘ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ సాహిల్ పురుషోత్తమ్ దోబ్లే, బీపీసీఎల్ టెరిటరీ అండ్ రిటేల్ కో ఆర్డినేటర్ మనీష్ మిట్టల్, ఎల్పీజీ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్లు, బందెల కృప అన్వేష్, వలుపదాసు రాంమనోహర్, ఏ.రజిత మరియు వివిధ జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో శనివారం లాంఛనంగా ‘భారత్ గ్యాస్ లైట్ జిప్ ‘ ప్రారంభమైంది.హనుమకొండలో 'LITE ZIP'ప్రారంభంఈ నూతన ఒరవడిని 100నగరాల్లో ప్రారంభించారు. ఇందులో భాగంగానే భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించేలా చర్యలు చేపట్టారు. అయితే బీపీసీఎల్ తీసుకున్న ఈ నూతన ఒరవడితో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి తాత్కాలికంగా జీవనం కొనసాగించే వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి నిరంతరం భారత్ గ్యాస్ సేవలు తక్షణమే అందించండం సుసాధ్యమవుతుంది.హనుమకొండలో 'LITE ZIP'ప్రారంభం‘భారత్ గ్యాస్ లైట్ జిప్ ‘ అనేది భవిష్యత్తుకు సిద్ధమైన ఎల్పీజీ వ్యవస్థను నిర్మించే తమ ప్రయాణంలో ఇక ముఖ్యమైన అడుగు అని ఉమ్మడి వరంగల్ జిల్లా బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్లు, రిటేల్ అండ్ టెరిటరీ కో ఆర్డినేటర్, డిస్ట్రిబ్యూటర్లు అన్నారు. తక్షణ అన్ బోర్డింగ్ మరియు ఎక్స్ ప్రెస్ డెలివరీ సౌకర్యాన్ని అందించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే తమ నిబద్దతకు ఈ విధానం నిదర్శనమని అన్నారు. రోజువారి జీవితాన్ని మరింత స్మార్ట్ గా, సులభంగా మరియు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చే ఎల్పీజీ సేవలను అందించే దిశగా ఇది మరో ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు వినియోంచుకోవాలని వారు కోరారు.