దారుణం..లవర్ కోసం ఫ్రెండ్ ని హత్యచేశాడు

దారుణం..లవర్ కోసం ఫ్రెండ్ ని హత్యచేశాడు

దారుణం..లవర్ కోసం ఫ్రెండ్ ని హత్యచేశాడు

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 17న హత్య జరగగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రేమ పైశాచికం అయితే..
తాను ప్రేమించిన యువతితో తన స్నేహితుడు సన్నిహితంగా ఉండటం చూసి ఓర్వలేకపోయాడు. తనకు సొంతం అనుకున్న అమ్మాయి మరో వ్యక్తితో మాట్లాడటం ఆ యువకుడికి నచ్చలేదు. దీంతో తన స్నేహితుడిని ఎలాగైన చంపి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అని చూడకుండా దారుణంగా హత్య చేసి గుట్టల్లో పడేశాడు. వారం రోజుల తర్వాత నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

దారుణంగా హత్య చేసి గుట్టల్లో పడేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్‌ కు చెందిన నేనావత్‌ నవీన్‌ నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ బీటెక్‌ నాలుగో ఏడాది చదువుతున్నాడు. అదే కళాశాలలో హరి కూడా చదువుకుంటున్నాడు. వీరిద్దరు కూడా స్నేహితులు వీరు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన హరి దారుణంగా నవీన్‌ను హత్య చేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని గుట్టల్లో పడేశాడు. నవీన్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ నెల 17న పార్టీ చేసుకుందామని తన స్నేహితుడి రూమ్‌ కు నవీన్‌ను హరి ఆహ్వానించాడు. పార్టీలో అమ్మాయి గురించి ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ విషయాన్ని నవీన్‌ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. శంకరయ్య ఇద్దరితో మాట్లాడి గొడవను ఆపారు. అప్పటి నుంచి నాలుగు నాలుగు రోజులైనా కళాశాలకు ఇంటికి నవీన్‌ రాకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దారుణం..లవర్ కోసం ఫ్రెండ్ ని హత్యచేశాడుగుండెను బయటకు తీసి..మర్మాంగాన్ని కూడా కోసి
ఈ హత్య గురించి పోలీసులు ఒళ్లు గగుర్లు పొడిచే విషయాలను వెల్లడించారు. నవీన్‌ ను దారుణంగా హత్య చేసిన అనంతరం హరి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి విచారిస్తుండగా పోలీసుల ఎదుట హరి లొంగిపోయాడు. ఈ హత్యతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరిహర కృష్ణ ఒక సైకో అని తెలుస్తోంది. నవీన్‌ ను కిరాతకంగా హత్య చేశాక ఈ విషయాన్ని ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఫ్రెండ్ అని గుర్తుకురాలేదా..
అమ్మాయికి పంపిన మెసెజ్ దారుణంగా ఉంది. ఈ వేలే కదా నిన్ను తాకింది. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది, అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది, అంటూ నవీన్‌ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు. ఇవన్నీ చదివిన అమ్మాయి ఓకే వెరీ గుడ్ బాయ్ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఆ అమ్మాయిని కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నారు.