ఖరారైన ఎంసెట్ పరీక్షా తేదీలు..ఎప్పుడో తెలుసా?
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇంజినీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ ను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మంగళవారం బషీర్ బాగ్ లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆల్ లింబాద్రి, ఉన్నతాధికారులతో పరీక్షల నిర్వహణపై ఆమె సమీక్షించారు. త్వరలో దరఖాస్తులు, ఫీజులతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ ను సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని చెప్పారు. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, జూలై 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్ లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ సెట్ ను జూలై 13న నిర్వహించనున్నారు.ఎంసెట్ లో ఈ యేడాది ఇంటర్ వెయిటేజీ ఉండదని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నది. సాధారణంగా ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. కరోనా దృష్ట్యా గత యేడాది వెయిటేజీని రద్దు చేశారు. ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించారు. గత అక్టోబర్ లో నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షల్లో 51 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. వారికి 35 శాతం మార్కులేసి పాస్ చేశారు. ఈనేపథ్యంలో ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ అమలు చేస్తే ఇబ్బందులు తప్పవన్న వాదనలున్నాయి.
ఈ యేడాది ఎంసెట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ లో 70 శాతం సిలబస్ కే ప్రశ్నలు అడుగనున్నారు. గత సంవత్సరం ఫస్టియర్ లో 100 శాతం సిలబస్, సెకండియర్ లో 70 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుం సెకండియర్ చదివే విద్యార్థులకు ఫస్టియర్ తో పాటు సెకండియర్ లోనూ 70 శాతం సిలబస్ బోధించడంతో అధికారులు ఈ మార్పు చేశారు.
పరీక్షల తేదీలు :
జూలై 13న ఈసెట్
జూలై 14, 15 ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్
జూలై 18, 19, 20 ఎంసెట్ ఇంజినీరింగ్
జూలై 23 ఎంసెట్ ప్రాంతీయ కేంద్రాలు
జూలై 105 ఎంసెట్ పరీక్షా కేంద్రాలు