ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్

ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్

వరంగల్ టైమ్స్ ,హైద‌రాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.200 కోట్ల ఆర్టీసీ కార్మికుల సీసీఎస్ బకాయిలను జమ చేయనుండగా.. గతేడాది ఆర్టీసీ సమ్మె కాలంలో 12 రోజులు కోత విధించిన వేతనాన్ని నేడు ఉద్యోగుల అకౌంట్లలో యాజమాన్యం జమ చేయనుంది. అటు కరోనా సమయంలో కోత విధించిన జీతాన్ని సోమవారం ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది.