గ్రేటర్ లో కేటీఆర్‌ నేటి నుంచి ప్రచారం

గ్రేటర్ లో కేటీఆర్‌ నేటి నుంచి ప్రచారంహైదరాబాద్‌: గ్రేటర్లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లోతమ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా అధికార పార్టీ నుంచి కేటీఆర్ ప్రచారానికి రెడి అయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగుర వేసే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో అన్నీతానై పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఆయన మరోసారి.. గ్రేటర్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్‌షో ప్రారంభించి.. కూకట్‌పల్లిలోనూ ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8గంటలకు సాగర్‌ హోటల్‌లో జంక్షన్‌లో కేటీఆర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.