ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ అనారోగ్యంతో మృతి

జర్నలిస్టు దేవిప్రియ అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహిత్య లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ అనారోగ్యంతో మృతిగుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. దేవిప్రియ ‘ఉదయం’ సహా పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. కానీ ‘దేవిప్రియ’ కలంపేరుతో రచనలు చేసేవారు. తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, తల్లి షేక్ ఇమామ్ బీ. జర్నలిస్టుగా ఆయన ప్రాజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ తదితర పత్రికల్లో పనిచేశారు. ఉదయం, హైదరాబాద్ మిర్రర్ పత్రికల్లో పనిచేశారు ఆయన రన్నింగ్ కామెంటరీ కార్టూన్ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. దాసి, రంగులకల తదితర సినిమాలకు ఆయన పనిచేశారు. అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, సమాజాంద స్వామి వంటి పలు రచనలు చేశారు. గాలి రంగు అనే గ్రంథానికి ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపెందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతభకు ‘గాలి రంగు’ రచన మచ్చు తునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.