కోవిడ్ టీకా పంపిణీపై మోదీ సమీక్షా

కోవిడ్ టీకా పంపిణీపై మోదీ సమీక్షా

ఢిల్లీ: కోవిడ్ టీకా అభివృద్ధి, పంపిణీకి సంబంధించి వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక రూపొందించే అంశంపై ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం అధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. నీతి ఆయోగ్ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దేశంలో జ‌రుగుతున్న కోవిడ్ టీకా అభివృద్ధి, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అంశాల‌ను ఆ స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జ‌రుగుతున్న పురోగ‌తితో పాటు.. అనుమ‌తులు ఎలా ఇవ్వాలి, టీకాల‌ను ఎంత మేర‌కు ప్రొక్యూర్ చేయాల‌న్న అంశాల‌ను ప‌రిశీలించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఒక‌వేళ టీకా మార్కెట్‌లోకి విడుద‌ల అయితే, అప్పుడు ఎవ‌రెవ‌రికి ముందుగా కోవిడ్ టీకాను ఇవ్వాల‌ని, కోల్డ్ చైన్ నిల్వ‌లు ఎలా ఉన్నాయో కూడా సంగ్ర‌హించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.