బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు
వరంగల్ టైమ్స్, మంచిర్యాల: అక్రమ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరయ్యింది. రూ.25వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. సోమవారం ఉదయం బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ ను వాయిదా వేసిన కోర్టు సాయంత్రం బెయిల్ మంజూరు వేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ బాల్క సుమన్ కు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుపడినప్పటికీ ఫలితం శూన్యం అయ్యింది. బెయిల్ పిటిషన్ పై మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్టులో అప్పీల్ చేయించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన జిల్లా కోర్టు మార్చి 5కి వాయిదా వేసింది. ఇక బెయిల్ పిటిషన్ పై లంచ్ తర్వాత తీర్పును వెల్లడించింది. గత 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ అగ్ర నాయకులు పరామర్శించి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందింది. అయితే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ అడ్డుకుని చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు బనాయించి జైలులో బంధించిన విషయం తెలిసిందే