పేకాట ఆడుతూ పట్టుబడిన హీరో బాలయ్య పీఏ

పేకాట ఆడుతూ పట్టుబడిన హీరో బాలయ్య పీఏ

వరంగల్ టైమ్స్, గౌరిబిదనూరు : కర్ణాటకలోని గౌరిబిదనూరులో ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ పీఏ గా ఉన్న బాలాజీపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాలయ్య పీఏతో పాటు మరి కొందరిపై కర్ణాటకలోని గౌరిబిదనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. వీరంతా గౌరిబిదనూర్ లో పేకాట ఆడుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బాలాజీతో పాటు మరో పన్నెండు మంది ఉపాధ్యాయులు పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రూ.1 లక్షా యాభై వేలు నగదును గౌరిబిదనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.