మన ఇంటి పరిసరాలు, పెరట్లో నీరు నిల్వ ఉంటే దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. దోమల ప్రభావంతో వ్యాధులు విజృంభిస్తాయి. ఫలితంగా డెంగీ, చికెన్‌గున్యా, మలేరియాతోపాటు అనేక రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే మన ఇంటి పరిసరాలలో కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల దోమలను నిరోధించవచ్చు. ముఖ్యంగా లెమన్ , గ్రాస్, తులసిలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కల పెంపకంతో దోమలను తరిమివేయడంతో కాలుష్యాన్ని కూడా నివారించవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు. తులసి మొక్కల్లో రామ తులసి, కృష్ణ తులసి , వన తులసిలాంటి ఐదు రకాలు ఉన్నాయి. అయితే ఇందులో కృష్ణ తులసి ప్రత్యేకమైంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన దోమలను తరిమేస్తుందని వివరించారు. ఇంటి వరండాల్లో లెమన్ గ్రాస్ మొక్కలను పెంచడం వల్ల దోమలను నివారించవచ్చు. అలాగే ఇవే కాకుండా సిట్రోనెల్లాలాంటి మొక్కలు కూడా దోమలను నివారిస్తాయని పేర్కొన్నారు.