తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెంపు

తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెంపుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాల ధర పెరిగింది. విజయ పాల ధరను పెంచుతున్నట్లు విజయ డెయిరీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. లీటర్ పాలపై రూ.2, లీటర్ టోన్డ్ పాలపై రూ.2, లీటర్ హోల్ మిల్క్ పై రూ.4 పెంచారు. పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమలుకానున్నాయి.