కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన వరంగల్ మేయర్

సూర్యాపేట: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు కుటుంబ సభ్యులను వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు పరామర్శించారు. సూర్యాపేట జిల్లాలోని వారి స్వగృహానికి వెళ్లిన వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాషరావు కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన వరంగల్ మేయర్కల్నల్ చిత్రపటం ముందు పుష్పగుచ్ఛం ఉంచి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సంతోష్ బాబు చైనా దురాగతాలను ఎదిరిస్తూ భారత సరిహద్దును కాపాడే ప్రయత్నంలో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందటం బాధాకరం అని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి పిన్న వయసులో కల్నల్ ఈ స్థాయికి ఎదగడం వారి దృఢ సంకల్పానికి, కార్య దీక్షకు అద్దం పడుతుందని అన్నారు. దేశ పరిరక్షణ కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించడం జరిగిందని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మేయర్ గుండా ప్రకాషరావు తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో భద్రకాళి ఆలయ పూర్వ ధర్మకర్త తోనుపునూరి వీరన్న, దాచేపల్లి సీతారాం తదితరులు ఉన్నారు.