జనగామ న్యూ కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం

జనగామ న్యూ కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎంవరంగల్ టైమ్స్, జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం చేశారు. ముందుగా హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లాకు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుండి కార్యాలయ ప్రవేశం వరకు లంబాడీ, గుస్సాడీ, కోయ, వివిధ కళారూపాల కళాకారులు తమ కళను ప్రదర్శిస్తూ, సీఎంకి స్వాగతం తెలిపారు. తదనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణంలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రిబ్బన్ కటింగ్ చేసి కేసీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గిరిజన, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జెడ్పి చైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి, డా. సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, 3వ వార్డ్ కౌన్సిలర్ డా. పగిడిపాటి సుధ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కేఎస్. శ్రీనివాస రాజు, ఇఎన్సీ ఐ. గణపతి రెడ్డి, వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.