దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన కేసీఆర్

దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన కేసీఆర్వరంగల్ టైమ్స్, జనగామజిల్లా: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొదలైన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో 105 ట్రై సైకిల్ మోటారు వాహనాలను సిద్ధం చేశారు. జనగామ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ఆవరణలో సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా పాలకుర్తి కి చెందిన 105మంది లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అంద చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ లబ్ధిదారులతో మాట్లాడారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది అన్నారు. దివ్యాంగుల శాఖకు తోడుగా, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ట్రైసైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను సీఎం అభినందించారు. దివ్యాంగులకు ఎంత చేసినా తక్కువేనని ఆయన అన్నారు.