సంతోష్ బాబుకు మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులు

హైదరాబాద్: నిరంతరం దేశ రక్షణ కోసం సరిహద్దులో సాహసం చేసి సమరంలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గారి త్యాగం ఈ దేశం ఎప్పటికీ మరిచిపోలేనిదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సూర్యాపేటకు చెందిన తెలంగాణ బిడ్డసంతోష్ బాబుకు మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులుసంతోష్ బాబు మరణంతో ఆ కుటుంబానికి ఏర్పడిన లోటు తీర్చలేనిదన్నారు. తనయుడు చనిపోయినా…దేశం కోసం ప్రాణం వదిలినందుకు గర్విస్తున్నామన్న వారి తల్లిదండ్రుల దేశభక్తికి మంత్రి సత్యవతి రాథోడ్ సెల్యూట్ చేశారు. వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకి జోహార్లు తెలిపారు. ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.