తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కొలువులు

తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కొలువులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పోలీసు శాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. ఆ శాఖలో భారీగా ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. 18,334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత యేడాది వరకు పోలీసు శాఖలో 31,972 ఉద్యోగ నియామకాలు చేపట్టారు. తాజాగా 18,334 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం ప్రకటించారు.తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కొలువులు2013-2014లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగులుండగా, 2019-2020 నాటికి వీరి సంఖ్య 86,829 కి పెరిగింది. ప్రస్తుతం ప్రకటించిన నియామకాలు భర్తీ అయితే ఈ సంఖ్య లక్షకు పైగా చేరుకోనుంది. పోలీసు శాఖలో భారీగా ఖాళీలుండటంతో ఆ పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే వారు ఆ ఉద్యోగానికి కావాల్సిన ప్రిపరేషన్ ను మొదలుపెట్టారు.