ఎంపీ అరవింద్ కు చుక్కలు చూపించిన రైతులు

ఎంపీ అరవింద్ కు చుక్కలు చూపించిన రైతులు

ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ నివాసం ముందు పసుపు కుప్పలు వేసి రైతుల నిరసనవెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని డిమాండ్.ఎంపీ అరవింద్ కు చుక్కలు చూపించిన రైతులువంరగల్ టైమ్స్ నిజామాబాద్ జిల్లా : ఎంపీ ధర్మపురి అరవింద్ పై పసుపు రైతులు ‌మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ ఇంటి ముందు పసుపు పంట పోసి నిరసన తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారంతో బట్టబయలు చేశారు. దీంతో అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ నిజామాబాద్ లో ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని పసుపు రైతులు స్పష్టం చేశారు. ‌