భీమా చెక్కులు అందించిన ఎమ్మెల్యే చల్లా

భీమా చెక్కులు అందించిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్,హనుమకొండ జిల్లా: కార్యకర్తల కుటంబాలకు టీఆర్ ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు టీఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ సభ్యత్వ భీమా ద్వారా మంజూరైన రూ. 6 లక్షల విలువచేసే చెక్కులను హన్మకొండలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందచేశారు.భీమా చెక్కులు అందించిన ఎమ్మెల్యే చల్లాఅనునిత్యం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు అకాల మరణం చెందితే ఆ కుటుంబ సభ్యులు ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ప్రతీ కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద భీమా చేపించడం జరిగిందన్నారు.మృతిచెందిన కార్యకర్తలు దామెర మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన చిల్ల ఎల్లస్వామి, నడికూడ గ్రామానికి చెందిన కామిడిరి నిర్మల సంగెం మండలం ఆశాలపల్లి గ్రామానికి చెందిన దండు రమేష్ ల కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా భీమా చెక్కులను అందచేశారు. భీమా చెక్కులు అందుకున్న బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.