హోల్ సెల్ కాంప్లెక్స్’ ప్రారంభించిన ఎర్రబెల్లి

హోల్ సెల్ కాంప్లెక్స్' ప్రారంభించిన ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం శివారులో నూతనంగా నిర్మించిన కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ హోల్ సెల్ కాంప్లెక్స్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. వరంగల్ హోల్ సెల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ లోని ధర్మారం సమీపంలో నూతనంగా 318 షాపులతో ఈ కాంప్లెక్స్ ను నిర్మించారు.

ఈ కాంప్లెక్స్ ను మంత్రి దయాకర్ రావు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అన్ని వస్తువులు హోల్ సేల్ ధరలకు ఒకే చోట దొరికే విధంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ వృద్ధిలోకి రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.