విజయనగరంలో గుప్తనిధుల కోసం క్షద్రపూజలు

విజయనగరంలో గుప్తనిధుల కోసం క్షద్రపూజలువిజయనగరం జిల్లా భోగాపురం గుప్తనిధుల కోసం అర్థరాత్రి క్షద్రపూజలు…భయాందోళనలకు గురైన గ్రామస్థులు. స్థానికుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయనగరం జిల్లా భోగాపురంఘ మండలం గూడెం పంచాయతీ బసవ పాలెం రెవిన్యూలో దట్టమైన అరణ్య మార్గంలో కొండోడుగుట్టలో గుప్త నిధులు ఉన్నాయంటూ కొందరు తవ్వకాలు చేపట్టడం సంచలనం రేపింది. శనివారం అర్ధరాత్రి పది మంది బృందంతో ఓ ప్రదేశంలో క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలను ప్రారంభించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో సుమారు పదిహేను అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి అక్కడ ఏమీ లేదని రుజువు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలియజేశారు.