వ్యాక్సిన్ తీసుకున్నవారికే దర్శన భాగ్యం

వ్యాక్సిన్ తీసుకున్నవారికే దర్శన భాగ్యంవరంగల్ జిల్లా : కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 13 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భక్తులనే బ్రహ్మోత్సవాలకు అనుమతిస్తామని ఈవో ఏ.నాగేశ్వర్ రావు బుధవారం స్పష్టం చేశారు.

కొవిడ్ నిబంధనలు ఖచ్ఛితంగా పాటించాలని ఆయన భక్తులను కోరారు. ప్రతీ ఒక భక్తుడు ఫేస్ మాస్క్ ధరించాలని , దర్శన క్యూలైన్లలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఐనవోలు జాతరకు సుమారు 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు ఆలయ ఈవో.