ఇంకా ఐసీయూలోనే ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్

ఇంకా ఐసీయూలోనే ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ముంబయి : ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూ వార్డులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ ప్రస్తుతం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల పాటు ఆమె అబ్జర్వేషన్ లో ఉండనున్నట్లు డాక్టర్ ప్రతీత్ సామ్ ధాని వెల్లడించారు. కొవిడ్ తో పాటు ఆమె న్యూమోనియా నుంచి బాధపడుతున్నట్లు డాక్టర్ పేర్కొన్నారు. మంగేష్కర్ కు కరోనా సోకినట్లు ఆమె మేనకోడలు రచనా షా మంగళవారం తెలిపారు.