కానిస్టేబుల్ ఉమేష్ ను హత్య చేసిన మావోయిస్టులు

చత్తిష్ ఘడ్: కానిస్టేబుల్ ఉమేష్ ను హత్య చేసిన మావోయిస్టులు..చత్తిష్ ఘడ్ లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. టేటం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఉమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఉమేష్ ను మావోయిస్టులు చంపినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు. కానిస్టేబుల్ ఉమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన వ్యక్తి అని సమాచారం.