స్పోర్ట్స్ డెస్క్ : ఈ సీజన్ తో కెరీర్ కు గుడ్ బై పలుకనున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా , సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్ లో సానియా మీర్జా రాజీవ్ రామ్ ( అమెరికా ) జోడీ 7-6 ( 8/6 ) , 6-4తో ఎలెన్ పెరెజ్-మాడ్వే మిడ్ కూప్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది.
1 గంటా 27 నిమిషాల పాటు సాగిన పోరులో సానియా జోడీ 5 ఏస్ లు సంధించి 4 బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్ లో స్టార్ ప్లేయర్ నాదల్ ( స్పెయిన్ ) 7-6 ( 16/14 ) 6-2, 6-2 తో మనారినో పై గెలిచి క్వార్టర్స్ కు దూసుకెళ్లగా , బెర్టిని, మోన్ ఫిల్స్ , షపలోవ్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-4, 6-3 తో అనిసిమోవాపై నెగ్గగా, క్రెజికోవా, కైస్ చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.